కథలాపూర్‌లో వాజ్‌పేయి 101వ జయంతి
NEWS Dec 26,2025 12:15 am
కథలాపూర్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు వాజపేయిని స్వాతంత్ర సమరయోధుడు, అసాధారణ పార్లమెంటేరియన్, దేశం కోసం నిస్వార్థంగా సేవలందించిన నేతగా కొనియాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.