సిరికొండలో నట్టల నివారణ మందులు
NEWS Dec 26,2025 12:12 am
సిరికొండ గ్రామంలో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందుల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ముద్దం రవి, ఉప సర్పంచ్ మల్లయ్య ప్రారంభించారు. రైతులు తమ పశువులకు నటన (నట్టల) నివారణ మందులు తప్పనిసరిగా వేయాలని పశు వైద్యాధికారి శ్రీనివాస్ సూచించారు. పశువులకు ఈ వ్యాధి వస్తే వాటి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఉత్పత్తి సామర్థ్యంపై కూడా ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమానికి హాజరైన సిరికొండ గ్రామ నూతన పాలకవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులను పశువైద్య ఉపకేంద్రం, యాదవ సంఘం తరఫున చిన్నపాటి సన్మానం చేశారు.