కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
NEWS Dec 26,2025 12:16 am
అదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ప్రారంభించారు. అదిలాబాద్ జిల్లాలో ఇంతకాలం పార్టీ కార్యాలయం లేకపోవడంతో, ఇటీవలే డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నరేష్ జాదవ్ పార్టీ కార్యకలాపాలకు ప్రత్యేక భవనం అవసరమని నిర్ణయించి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరేష్ జాదవ్‌కు అభినందనలు తెలిపారు.