కారుకు మంటలు.. 8మంది సురక్షితం
NEWS Dec 26,2025 12:11 am
కోరుట్లకి చెందిన కుటుంబం అడెల్లి పోచమ్మ ఆలయానికి వెళ్తుండగా మధ్యలో అగ్ని ప్రమాదం నుంచి తప్పిన ఘటన. మల్లాపూర్ గ్రామ శివారులో ప్రయాణం మధ్యలో ఒక చిన్నారికి అత్యవసరంగా వాష్‌రూమ్ అవసరం కావడంతో డ్రైవర్ కారు ఆపాడు. ఇదే సమయంలో కారు ఇంజిన్ ముందు భాగం నుండి అకస్మాత్తుగా మంటలు, పొగలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే స్పందించి కారులో ఉన్న 8 మందిని సురక్షితంగా బయటకు దింపాడు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైపోయింది.