'కేసీఆర్ ఏ బ్రాండ్ తాగి వచ్చాడో..'
NEWS Dec 25,2025 02:58 pm
కేసీఆర్ రెండేళ్లుగా ఫార్మ్‌హౌస్‌లో పడుకుని ప్రజలకు ముఖం చూపించుకోలేదని, ఏ బ్రాండ్ మందు తాగి బయటకు వచ్చాడో తెలియదంటూ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సెటైర్లు వేశారు. తనను తాను దేశ్ కీ నేతగా ప్రకటించుకున్నాడని, గ్రామాల్లో సర్పంచ్‌లు ఓడిపోవడంతో మతి భ్రమించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇక కేటీఆర్ లాంటి అసమర్థ వ్యక్తిని నమ్మితే పార్టీ మునిగిపోతుందని, ఆయనను నమ్మకపోవడమే కేసీఆర్ బయటకు రావడానికి కారణమని కామెంట్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం వల్లే బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడి కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందన్నారు.