రాముడి పాత్ర కోసం మహేశ్ న్యూ లుక్!
NEWS Dec 25,2025 02:51 pm
ఇటీవల మహేశ్ బాబు లాంగ్ హెయిర్, గడ్డంతో కాస్త రగ్గుడ్ లుక్‌లో కనిపించాడు. ఇప్పుడు క్లీన్ షేవ్ చేసుకుని మిల్క్ బాయ్‌లా మారిపోయాడు. వారణాసి మూవీలో ఆయన రాముడిగా కనిపిస్తారని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తైందని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కొత్త షెడ్యూల్‌లో రాముడి పాత్ర షూట్ కోసమే ఇలా గెటప్ మార్చేశారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.