గాజులపేట పురాతన చర్చిలో క్రిస్మస్
NEWS Dec 25,2025 02:52 pm
నిర్మల్ జిల్లా శివారులో గల గాజులపేట చర్చి – తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత పురాతన చర్చిలలో ఒకటిగా గుర్తింపు పొందింది. 1932లో క్రైస్తవ ప్రచారకుడు అప్పదురై చేతుల మీదుగా ఫ్రెంచ్ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ చర్చి, ప్రత్యేక శిల్పకళా సౌందర్యంతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఇదే పురాతన చర్చిలో మంగళవారం క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే క్రైస్తవ భక్తులు భారీ సంఖ్యలో హాజరై ప్రార్థనలు, క్రీస్తు ఆరాధనలో పాల్గొన్నారు. అనంతరం పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.