కేసీఆర్ నువ్వెంత.. నీ స్థాయి ఎంత?
NEWS Dec 24,2025 09:17 pm
నువ్వెంత.. నీ స్థాయి ఎంత అంటూ సీఎం రేవంత్ రెడ్డి , కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా.. ఓ మాజీ సీఎం మాట్లాడే తీరు ఇలాగేనా? తాను కూడా కింది స్థాయి నుంచి వచ్చానని, మాట్లాడటం తనకు వచ్చని అన్నారు. కేటీఆర్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని గొడవ పెడుతుంటే.. తండ్రి ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శిస్తున్నాడు. తానేమి అమాయకులను దుబాయ్ పంపుతానని మోసం చేయలేదని.. కేసీఆర్.. నీ స్థాయి ఎంత..? నువ్వెంత.. నీకు భయపడతామా అని గరం అయ్యారు.