గిరిజన ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు
NEWS Dec 24,2025 09:10 pm
దేశ ప్రజలకు ఆనందం, ప్రేమ, శాంతి, సహనం ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ గిరిజన ఇంజనీరింగ్ శాఖ భద్రాచలం కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ తెలిపారు. ఉద్యోగులంతా కలిసి వేడుకలు జరుపుకోవడం ఆనందకరమని చెప్పారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకటస్వామి, భవాని, బుచ్చలు, వెంకన్న, బుచ్చిబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.