ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన వైద్యాధికారి
NEWS Dec 24,2025 09:09 pm
మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్ బుధవారం సందర్శించారు. మాతా–శిశు ఆరోగ్య కార్యక్రమాలు, సార్వత్రిక టీకాలు, ఫార్మసీ, ల్యాబ్‌లను పరిశీలించి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్ ఉన్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ మౌనిక సిబ్బందితో కలిసి డీఎంఓను సత్కరించారు.