బాసర క్షేత్రానికి ₹ 2.28 కోట్ల ఆదాయం
NEWS Dec 24,2025 09:09 pm
బాసర సరస్వతీ క్షేత్రం పరిధిలో వివిధ వ్యాపారాల నిర్వహణకు ఏడాది కాలానికి మంగళవారం అధికారులు టెండర్లు నిర్వహించారు. వీటితో మొత్తం ₹2.28 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తుల చీరల పోగుకు ₹85 లక్షలు, పూజా సామగ్రికి ₹61.61 లక్షలు, సెల్‌ఫోన్ కౌంటర్‌కు ₹20.20 లక్షలు తదితరంగా ఆదాయం వచ్చింది. కొన్ని టెండర్లకు ఆశించిన ధరలు రాకపోవడంతో వాయిదా వేసి కమిషనర్‌కు లేఖ రాశామని ఈఓ అంజనీ దేవి తెలిపారు.