క్రిస్మస్ వేడుకల్లో DCC ఆత్రం సుగుణ
NEWS Dec 24,2025 09:07 pm
ఆసిఫాబాద్ మండలం రాజాంపేట్ గ్రామంలో క్రిస్మస్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆత్రం సుగుణక్క, అజ్మీరా శ్యాం నాయక్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. అతిథులు క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ క్రిస్మస్ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ ప్రజల ఐక్యతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు.