వరల్డ్ కప్ విజేతగా టీమ్ ఇండియా!
చరిత్ర సృష్టించిన భారత మహిళలు!
NEWS Nov 02,2025 06:31 pm
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి, టీమిండియా ప్రపంచకప్ ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, ఓపెనర్ షఫాలీ వర్మ (87) మెరుపు ఆరంభం, దీప్తి శర్మ (58)తో 298 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 52 పరుగుల తేడాతో ఓడింది. ఈ విజయంతో భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడింది. టీమిండియాకు ఐసీసీ రికార్డు స్థాయిలో రూ. 39.78 కోట్లు ప్రైజ్ మనీగా ఇవ్వనుంది.