కలెక్షన్ కింగ్‌కు 50 నట వసంతాలు!
NEWS Nov 02,2025 10:23 pm
నటుడు మోహన్ బాబు సినీ పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. 5 దశాబ్దాల వేడుకల్లో భాగంగా నవంబర్ 22న ‘MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ పేరుతో వేడుక చేస్తున్నట్టు మంచు విష్ణు ప్రకటించారు. ఈ వేడుకను ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 1975లో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్ బాబు, తన విలక్షణ నటన, డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేశారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 600కు పైగా చిత్రాలలో నటించారు.