రాజమౌళి-మహేష్ మూవీ టైటిల్‌తో పాటు ఓ పవర్‌ఫుల్ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో 'ఫస్ట్ రివీల్' పేరిట గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈవెంట్‌ను 'జియో హాట్‌స్టార్' ప్లాట్‌ఫామ్‌లో లైవ్ స్ట్రీమ్ చేస్తారు. అవుట్‌డోర్ లొకేషన్లలో చిత్రీకరణ కష్టతరం కావడంతో రామోజీ ఫిల్మ్ సిటీలో 50 కోట్ల భారీ బడ్జెట్‌తో వారణాసి సెటప్‌ను నిర్మించారు. సినిమాను 2027 మార్చి 25న 120 దేశాల్లో రిలీజ్‌కు ప్లాన్ చేశారు.