దక్షిణాఫ్రికాకు 299 లక్ష్యమిచ్చిన టీమిండియా
NEWS Nov 02,2025 08:44 pm
ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత్ బ్యాటింగ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికా ముందు 299 పరుగుల లక్ష్యం ఉంచింది. నవీ ముంబైలో జరుగుతున్న ఈ తుదిపోరులో టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (87), స్మృతి మంధాన (45) శుభారంభం అందించారు. అనంతరం దీప్తి శర్మ (58) హాఫ్ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. రిచా ఘోష్ (34) చివర్లో వేగంగా పరుగులు సాధించింది. సఫారీ బౌలర్లలో అయబొంగా ఖాకా 3 వికెట్లు తీయగా, డి క్లర్క్, మ్లాబా, ట్రయాన్ ఒక్కొక్కరు తలో వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా ముందు 299 పరుగుల భారీ లక్ష్యం ఉంది.