కార్తీక మాసంలో భక్తులతో కిటకిటలాడుతున్న
లింగ రూప మహా మృత్యుంజయాలయం
NEWS Nov 02,2025 08:35 pm
ఆలయంలో కొలువుదీరిన శివలింగాన్ని చూడగానే ‘హర హర మహాదేవ.. శంభో శంకర’ అంటూ దండం పెట్టుకుంటారు భక్తులు. ఆలయమే శివలింగం రూపంలో దర్శనమిస్తే పరవశంతో పులకించిపోతారు. అసోంలో మహా మృత్యుంజయ టెంపుల్ 126 అడుగుల ఎత్తులో భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన లింగాకృతిగా పేరుపొందిన ఈ ఆలయం.. కార్తిక మాసమంతా భక్తులతో కిటకిటలాడుతుంది!