అభిమానులకే అవార్డు అంకితం
ట్వీట్ చేసిన అల్లు అర్జున్
NEWS Nov 02,2025 02:56 pm
పుష్ప సినిమాలో నటనకుగాను ప్రతిష్ఠాత్మక అవార్డుకు అల్లు అర్జున్ ఎంపికయ్యాడు. ‘మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి ఆయన ఎంపికైనట్లు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్-2025 ప్రకటించింది. దీనిపై స్పందించిన అల్లు అర్జున్ తన అభిమానులకు అవార్డును అంకితం ఇస్తున్నానని ట్వీట్ చేశాడు. ప్రేక్షకుల నిరంతర ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలిపాడు. గతేడాది రిలీజైన పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది.