గిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
NEWS Nov 02,2025 07:54 pm
గిరిజన ప్రాంతాలను అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దడం, మౌలిక వసతులు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన సంకల్పమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జిసిసి చైర్మన్ ఎంవివి ప్రసాద్ అన్నారు. పి.మాకవరంలో రూ.12 లక్షలతో అంగన్వాడి భవనం, బట్ట పనుకులలో రూ.32 లక్షలతో పంచాయతీ కార్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీటి సదుపాయాలు, పంచాయతీలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని పేర్కొన్నారు.