ఆదివాసీ హక్కుల సాధన కోసం సమావేశం
NEWS Nov 02,2025 07:52 pm
గంగవరం మండల కేంద్రంలో ఆదివాసి హక్కులు, ఉద్యోగాల సాధన కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కమిటీ అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్లి రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మడి మురళి దొర నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు ఆదివాసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. 1/70 చట్టం, పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం, పోలవరం భూసేకరణ చట్టం (2013)లు ఇప్పటికీ పటిష్టంగా అమలుకావడం లేదని విమర్శించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం కలసి ఆదివాసీల హక్కులను హరించేందుకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు.