రెండు వర్గాల మధ్య ఘర్షణ
పలువురికి గాయాలు
NEWS Nov 02,2025 07:51 pm
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనుమల రోడ్డులో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఒకరిపై ఒకరు కర్రలతో, చేతులతో దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.