ఘనంగా మహిళల గాజుల వేడుక
NEWS Nov 02,2025 02:19 pm
నిర్మల్ పట్టణంలోని జుమ్మేరాత్ పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2008 బ్యాచ్ మహిళలు ఆదివారం స్నేహపూర్వకంగా “గాజుల పండుగ”ను ఘనంగా జరుపుకున్నారు. భారతీయ సంప్రదాయంలో గాజులు ఐదో తనానికి ప్రతీకగా నిలుస్తాయని భావిస్తూ, ఈ సందర్భంగా మహిళలు ఒకరికొకరు గాజులు వేసుకుని, గోరింటాకు పెట్టుకున్నారు. ఆటలు, పాటలతో ఉల్లాసంగా గడిపిన వారు వాయినాలు ఇచ్చిపుచ్చుకుని స్నేహ బంధాన్ని మరింత బలపరచుకున్నారు. ఈ కార్యక్రమం నవ్వులు, ఆనందాలతో సందడిగా సాగింది.