లండన్ వెళ్లిన చంద్రబాబు దంపతులు
NEWS Nov 02,2025 04:40 pm
ఏపీ సీఎం చంద్రబాబు, సతిమణి భువనేశ్వరి లండన్ చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన చంద్రబాబు దంపతులకు విమానాశ్రయంలో తెలుగు కుటుంబాలు ఆత్మీయ స్వాగతం పలికాయి. సామాజిక సేవా రంగంలో భువనేశ్వరి కృషికి గుర్తింపుగా 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్' అవార్డును ఐఓడీ సంస్థ ఆమెకు ప్రదానం చేస్తారు. అదేవిధంగా, కార్పొరేట్ పాలనలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించినందుకు గాను హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు 'గోల్డెన్ పీకాక్' అవార్డు లభించింది. హెరిటేజ్ ఫుడ్స్ అధినేతగా ఈ పురస్కారాన్ని కూడా భువనేశ్వరి అందుకుంటారు. ఎల్లుండి ఆమె 2 అవార్డులను స్వీకరిస్తారు.