కొత్త చరిత్ర దిశగా 'బాహుబలి- ది ఎపిక్'
NEWS Nov 02,2025 04:16 pm
'బాహుబలి - ది ఎపిక్' సినిమా రిలీజైన తొలి రోజు ఇండియాలో 12.35 కోట్లు, విదేశాల్లో 4 కోట్లు, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 16.35 కోట్లు వసూలు చేసింది. 2వ రోజు ప్రపంచవ్యాప్తంగా 13.15 కోట్లు రాబట్టింది. దీంతో 2 రోజుల్లో ఈ సినిమా 29.5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. రీ-రిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే తొలి సారి. అతి త్వరలోనే రీ-రిలీజ్‌లో 100 కోట్ల వసూళ్లను అందుకుని కొత్త చరిత్ర తిరగరాయనుంది.