గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
బీజేవైఎం నేత పాంగి మత్స్య కొండ బాబు
NEWS Nov 02,2025 10:57 am
అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజను బీజేవైఎం అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్య కొండబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు “గిరిజనులే తొలి స్వాతంత్య్ర సమరయోధులు” అనే పుస్తకాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడిన మత్స్య కొండబాబు, గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని కోరారు. ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి కొనసాగుతోందని ప్రాజెక్ట్ అధికారికి వివరించారు.