AP: నిన్న తొక్కిసలాట జరిగిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయాన్ని అధికారులు మూసేశారు. ఆలయ నిర్వాహకుడు హరిముకుంద పండా గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయన నివాసం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. అటు తొక్కిసలాటపై విచారణ కొనసాగుతోంది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ తొక్కిసలాటలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.