రోడ్డు లేక ప్రాణాలు కోల్పోతున్నాం
NEWS Nov 02,2025 02:03 pm
అనంతగిరి: పెద్దకోట పంచాయతీలోని చింతలపాలెం గిరిజనులు తమ గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో పెదగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. రోడ్డు మార్గం లేకపోవడం వల్ల పీహెచ్సీకి వెళ్లి చికిత్స పొందలేక గత 2 వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సూకూరు కన్నయ్య దొర (52) మరణించారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సార్లు అధికారులకు, కలెక్టర్‌కి వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ స్పందన లేదని వాపోయారు. కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చర్యలు తీసుకుని గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని, ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు.