AP: కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే కాశీబుగ్గ తొక్కిసలాటలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ 2 ఘటనల్లోనూ నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజలను చిదిమేశాయి. తాజా దుర్ఘటనలో ఆలయం గురించి విపరీతమైన ప్రచారం, సౌకర్యాల లేమి 10 మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఎవరో చేసిన తప్పులకు మరెవరో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. జాగ్రత్తలు తీసుకోకపోతే మున్ముందు కూడా మరణామృదంగం కొనసాగుతూనే ఉంటుంది.