కాశీబుగ్గ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి
NEWS Nov 01,2025 02:44 pm
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, క్షతగాత్రులకు ₹50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ తొక్కిసలాటలో 9 మంది మృతి చెందారు. వీరిలో 8 మంది మహిళలు, ఒక బాలుడున్నారు. గాయపడిన వారికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.