AP: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అటు మంత్రి లోకేశ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోందని చెప్పారు.