ముదిరిన ఆసియా కప్ ట్రోఫీ వివాదం
NEWS Nov 01,2025 02:17 pm
ఆసియా కప్ 2025 ట్రోఫీని ఇప్పటివరకు అప్పగించకపోవడంపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహంతో ఉంది. మరో 2-3 రోజుల్లో ట్రోఫీని తమకు అందించకపోతే ఈ విషయాన్ని ICC దృష్టికి తీసుకెళతామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చెప్పారు. దుబాయ్‌లో సెప్టెంబర్ 28న జరిగిన ఫైనల్‌లో భారత జట్టు, పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసియా కప్ గెలుచుకుంది. మ్యాచ్ అనంతరం బహుమతి ప్రదానోత్సవంలో ఏసీసీ ఛైర్మన్, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది.