కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది.