సైక్లోన్ బాధితులకు పరిహారం అందించిన తహసీల్దార్
NEWS Nov 01,2025 12:44 pm
ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. కొండేపి మండల కేంద్రానికి సంబంధించిన ఆరు రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, బాధితులకు భోజనం, వసతి సదుపాయాలు కల్పించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఒక్క వ్యక్తికి రూ.1000, ఇద్దరు సభ్యులు ఉన్న కుటుంబానికి రూ.2000, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ సభ్యులు ఉన్న కుటుంబాలకు రూ.3000 చొప్పున షాప్ నంబర్ 1 వద్ద పంపిణీ చేశారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సంబంధిత రేషన్ డీలర్లు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. అధికారులు బాధిత కుటుంబాల అవసరాలను పరిశీలించి, తక్షణ సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.