ఘనంగా ‘రన్ ఫర్ యూనిటీ’ నిర్వహణ
NEWS Oct 31,2025 11:16 pm
దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కథలాపూర్‌లో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కథలాపూర్ ఎస్‌ఐ నవీన్ నాయకత్వంలో శనివారం ఉదయం ప్రారంభమైంది. సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు నిర్వహించిన ఈ రన్‌లో పోలీస్ మిత్రులు, ZPHS, TGMS, KGBV, మాస్ట్రో పాఠశాలల విద్యార్థులు, మండలంలోని నాయకులు, యువత, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్య్రం అనంతరం దేశ ఐక్యత సాధనలో సర్దార్ పటేల్ చేసిన విశేష కృషిని గుర్తు చేస్తూ ఎస్‌ఐ నవీన్ ప్రసంగించారు. “దేశంలోని 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి నిజాం పాలన నుండి హైదరాబాద్ (తెలంగాణ)ను విముక్తి చేయడంలో సర్దార్ పటేల్ గారి పాత్ర అమూల్యం” అని అన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.