బంగారం ధరల్లో ఊహించని మార్పు
NEWS Oct 31,2025 08:58 pm
వరుసగా తగ్గుతున్న బంగారం ధర ఇవాళ ఒక్కసారిగా పెరిగింది. ఒకే రోజు 2 సార్లు పెరిగింది. హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1800 పెరిగి రూ. 1,23,280 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,000 వద్ద నిలిచింది. ఇక కేజీ వెండి రేటు రూ. 1,65,000 వద్ద ఉంది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 151000 వద్ద నిలిచింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి ధర కొంత తక్కువే అని తెలుస్తోంది.