మొంథా తుపాన్ బాధితులకు సహాయం
NEWS Oct 31,2025 11:14 pm
అనంతగిరి మండలం కోనాపురం పంచాయతీ పరిధిలోని వంట్లమామిడి, చప్పడి గ్రామాలకు చెందిన మొంథా తుపాన్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున సహాయం అందించారు. ఎమ్మార్వో వీరభద్రచారి అధ్యక్షతన జెడ్పీటీసీ గంగరాజు, సర్పంచ్ అప్పారావు, రఘునాథ్, ఎంపీటీసీ అరుణ నవీన్ లు బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకులను చేతుల మీదుగా పంపిణీ చేశారు. మొంథా తుపాన్ ప్రభావంతో కొండచరియలు విరిగి పడటంతో వంట్లమామిడి, చప్పడి గ్రామాల గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని జెడ్పీటీసీ గంగరాజు తెలిపారు. ప్రస్తుతం వారిని బొర్రా బాలుర ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో నివసించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. తుపాన్ దాటికి నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ₹3,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తోందని, ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వారికి మోడల్ కాలనీ నిర్మించి నివాస సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.