మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల పోలీసులకు
అవార్డులతో ఎస్పీ అభినందనలు
NEWS Oct 31,2025 09:08 pm
మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల పట్టణాలను వణికిస్తూ, 11 ఇళ్లలో, ఒక గుడిలో జరిగిన చోరీల కేసులను మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ నేతృత్వంలోని పోలీస్ బృందం స్వల్పకాలంలోనే ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. కోరుట్ల ఎస్ఐ చిరంజీవి క్లిష్టమైన కేసును సమర్థవంతంగా ఛేదించి తన దర్యాప్తు నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ బృందాలను అభినందించారు. వారి కృషి, సమన్వయంతో నేరాలను అరికట్టడంలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఎస్పీ వారిని ప్రశంసిస్తూ అవార్డులు ప్రదానం చేశారు.