3 రాష్ట్రాల్లో పోటీ, ఓ గెలుపు, ఇప్పుడు మంత్రి
NEWS Oct 31,2025 06:43 pm
TG: టీమిండియా మాజీ కెప్టెన్, మంత్రి అజహరుద్దీన్ పొలిటికల్ జర్నీ 3 రాష్ట్రాల మీదుగా సాగింది. 2009లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన మొరదాబాద్ (UP) ఎంపీగా గెలిచారు. 2014లో టోంక్ సవాయూ మాధోపుర్ (రాజస్థాన్) ఎంపీగా ఓడిపోయారు. 2019లో టికెట్ దక్కలేదు. 2023లో సొంత నగరంలోని జూబ్లీహిల్స్ MLAగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల మధ్య తాజాగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.