మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం
NEWS Oct 31,2025 06:40 pm
టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. అల్లా పేరు మీద అజారుద్దీన్ ప్రమాణం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్, మంత్రులు పాల్గొన్నారు. అజారుద్దీన్ కు ఏ శాఖ కేటాయిస్తారనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.