సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
NEWS Oct 31,2025 06:28 pm
మెట్‌పల్లి: వెంపేట గ్రామంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. కోరుట్ల పశువైద్య కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, గ్రామ ప్రజల్లో ఐక్యత, జాతీయ సమైక్యతపై అవగాహన కల్పించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మెట్‌పల్లి మండల పశువైద్య అధికారి డా. మనీషా పటేల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ స్రవంతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు గోపాల కృష్ణ, డా. విశాల్, డా. సురేష్, డా. మల్లేష్, డా.రవికాంత్ పాల్గొన్నారు. పశువైద్య సహాయక సిబ్బంది రమణయ్య, రవి, గంగాధర్, ఆఫీస్ సబార్డినేట్ దిలీప్, చిరంజన్, మోహన్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.