వేంపేటలో ఉచిత పశువైద్య శిబిరం
NEWS Oct 31,2025 05:18 pm
మెట్‌పల్లి: వేంపేటలో జాతీయ సేవా పథకంలో భాగంగా జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ, కోరుట్ల పశువైద్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం, గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖ అధికారి డా. బి. ప్రకాష్, కళాశాల అసోసియేట్ డీన్ డా. డి. శ్రీనివాస్ ప్రారంభించారు. శిబిరంలో భాగంగా ఆవులు, గేదెలకు చూడి పరీక్షలు, గర్భకోశ వ్యాధి చికిత్సలు, అనారోగ్యం ఉన్న గేదెలు, గొర్రెలు, మేకల పేడపై పరిశీలన చేసి, పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. టీకాలు వేయించడం ద్వారా పశువులు ఆరోగ్యంగా ఉండి పాలు ఉత్పత్తి పెరుగుతుందని డా. ప్రకాష్, డా. శ్రీనివాస్ తెలిపారు.