మెట్‌పల్లిలో దొంగల ముఠా అరెస్ట్
NEWS Oct 31,2025 01:52 pm
మెట్‌పల్లిలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా కోరుట్ల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో ఇళ్లతో పాటు ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.20,000 నగదు, వెండి ఆభరణాలు, 4 ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టులతో 11కి పైగా కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉందని డీఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితుడు కాశిరాం (కూలీ) మెట్‌పల్లిలో ఇళ్ల వివరాలు సేకరించేవాడని, అతని సహచరులు ఎల్లయ్య, సాయిలు రాత్రి వేళల్లో మాస్కులు, గ్లౌజులు ధరించి తాళాలు, బీరువాలు పగులగొట్టి దొంగతనాలు చేపట్టేవారని తెలిపారు.
దొంగతనాల ద్వారా సొంతం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలను గోల్డ్‌స్మిత్ వెంకటచారి కొనుగోలు చేసి దాచిపెట్టేవాడని, ఈ దొంగల ముఠా అరెస్టుతో ఇటీవల చోటుచేసుకున్న పలు దొంగతన కేసులు వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ వివరించారు.