మెట్ పల్లి పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ
NEWS Oct 31,2025 12:38 pm
మెట్ పల్లి పోలీస్ స్టేషన్ నుండి బస్ డిపో వరకు రన్ ఫర్ యూనిటీ 2కే రన్ నిర్వహించారు. 2 కి.మీ. పట్టణంలోని యువకులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, సిబ్బంది ఉత్సాహంగా పరిగెత్తారు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా ఏక్త దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇలాంటి కార్యక్రమం వల్ల దేశం మొత్తం ఒకటిగా, ఐక్యంగా ఉండాలని పిలుపు ఇస్తున్నామని మెట్ పల్లి డీఎస్పీ రాములు అన్నారు. మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ముజీబ్, ముత్తయ్య, గంగాధర్, విద్యార్థులు పాల్గొన్నారు.