పటేల్ జయంతి సందర్భంగా 2K రన్
NEWS Oct 31,2025 06:31 pm
నిర్మల్ జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఏకతా దివస్ను పురస్కరించుకొని ఈ ఉదయం 2K రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. గ్రామీణ ఎస్సై లింబాద్రి ఆధ్వర్యంలో మంజులాపూర్ వరకు 2K రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ సిబ్బంది, పట్టణంలోని యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రన్ అనంతరం మంజులాపూర్ గ్రామస్థులు ఎస్సై లింబాద్రిని శాలువాతో సత్కరించి తమ కృతజ్ఞతను తెలియజేశారు. సమాజంలో ఐక్యత, దేశభక్తి భావాలను పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.