బంగారుమెట్ట జంక్షన్ వద్ద రహదారి మరమ్మతులు
NEWS Oct 31,2025 06:29 pm
బుచ్చయ్యపేట మండలంలోని బంగారుమెట్ట జంక్షన్ వద్ద భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారిని ఎంపీడీవో శివప్రసాద్ నారాయణరావు ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చేపట్టారు. బిఎన్ రోడ్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద పోలేపల్లమ్మ గుడి దగ్గర నుండి బంగారుమెట్ట జంక్షన్ మర్రిచెట్టు వరకు తుపాను వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలు, గొయ్యిలను జేసీబీ సహాయంతో పూడ్చి, రహదారిని సరిచేశారు. డిప్యూటీ ఎంపీడీవో ఎం.వి.ఎస్. లవరాజు కూడా పాల్గొని పనులను పర్యవేక్షించారు. రహదారి పునరుద్ధరణతో వాహనదారులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కొంత ఊరట లభించింది. ఎంపీడీవో కార్యాచరణను ప్రశంసిస్తూ, తుపాను వల్ల దెబ్బతిన్న మరిన్ని రహదారులను మరమ్మతు చేయాలని ప్రజలు కోరారు.