ఉద్యోగ విరమణ చేసిన గురువుకు సత్కారం
NEWS Oct 30,2025 11:15 pm
మారుమూల ప్రాంతాల్లో విద్యార్థుల అజ్ఞాన చీకటిని తొలగించి, జ్ఞానం అనే వెలుగును నింపిన గురువుకు ఆయన శిష్యులు ఘన సత్కారం చేశారు. మండలంలో విద్యార్థులందరూ ఏకమై తమ ప్రియ గురువు శ్రీ రొంగలి లక్ష్మణరావు గారిని సత్కరించి, ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, లక్ష్మణరావు గారు తన బోధనతో అనేక మంది విద్యార్థుల జీవితాలను మారుస్తూ, వారికి మంచి భవిష్యత్తు చూపించారని గుర్తుచేశారు. మండలంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొని ఆయన సేవలను ప్రశంసించారు.