అగ్గిలో కాలి బూడిద అయిన బస్సును అధికారులు రోడ్డు మీద నుంచి పక్కకు తీసుకువచ్చి పెట్టారు. ఆ బస్సు దగ్గర కొంతమంది బంగారం కోసం వెతుకులాట ప్రారంభించారు. దాదాపు ఎనిమిది మంది దాకా ఆ బస్ దగ్గర బూడిదను సేకరించారు. బస్తాలలో నింపుకున్నారు. వారు ఎంతో ఓపిగ్గా బూడిదను తవ్వి మరీ బస్తాలలో నింపుకున్నారు. బంగారం వెలికితీయడం కోసమే బూడిదను సేకరించినట్లు తెలుస్తోంది.