నిర్మల్: గండి రామన్న సాయిబాబా ఆలయం నుండి గురువారం పలువురు భక్తులు షిరిడీకి పాదయాత్రగా బయలుదేరారు. ప్రయాణం ప్రారంభానికి ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం 15 మంది భక్తులతో కూడిన ఈ బృందం 15 రోజులపాటు కాలినడకన ప్రయాణించి షిరిడీలో సాయినాథుని దర్శించుకోనుందని సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గత 11 ఏళ్లుగా ప్రతి సంవత్సరం దత్త జయంతిని పురస్కరించుకొని ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.