గూగుల్‌కి కాసులు కురిపించిన AI
NEWS Oct 30,2025 04:01 pm
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ కంపెనీ రికార్డు స్థాయి ఆదాయాన్ని సాధించిందని వెల్లడించారు. ఈ ఏడాది Q3లో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఏకంగా100 బిలియన్ డాలర్ల (రూ.8 లక్షల 50వేల కోట్ల) ఆదాయం సాధించింది. మరీ ముఖ్యంగా AI వ్యాపార విభాగం, క్లౌడ్ సర్వీసెస్, యూట్యూబ్, గూగుల్ వన్ వంటి సబ్ స్కిప్షన్ ఆధారిత విభాగాలు అభివృద్ధిని చూడటం ఆదాయాలకు కారణంగా వెల్లడైంది. గూగుల్ క్లౌడ్ ఆదాయం 34% పెరిగి 15.16 బిలియన్ డాలర్లకు చేరింది. AI ఆధారిత వినియోగం ద్వారా గూగుల్ జెమినీ AI యాప్ 650 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ వినియోగదారులను పొందింది.