రైతులకు నష్టపరిహారం చెల్లించాలి-సోమేల
NEWS Oct 30,2025 09:02 pm
అనంతగిరి: మొంథా తుఫాన్ ప్రభావంతో అల్లూరి జిల్లా పరిసర ప్రాంతాల్లో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారని, వారికి తక్షణ నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని ఆదివాసీ పరిరక్షణ సమితి అనంతగిరి మండల అధ్యక్షుడు సోమేల స్వామి విజ్ఞప్తి చేశారు. తుఫాన్ కారణంగా పంటలు, తాటి తోటలు, ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. బాధిత రైతులకు అండగా నిలవాలని, ఈ విషయాన్ని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి నివేదించి సమస్యను పరిష్కరించాలని స్వామి కోరారు.